నూతన సంవత్సర శుభాకాంక్షలు: సచిన్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఎంతో వేడుకగా గుడి పడవ (మరాఠీ నూతన సంవత్సరం) జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన తల్లి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం తన పెంపుడు కుక్కను కూడా పిలిచి తన తల్లికి నమస్కారం చేయమని చెప్పాడు. అలాగే అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్‌గా మారింది.