'కళలను ఆదరించడం మన బాధ్యత'

'కళలను ఆదరించడం మన బాధ్యత'

SRCL: ప్రాచీన కళలను, నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు అన్నారు. వేములవాడ పట్టణంలోని 25వ వార్డులో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నాటక ప్రదర్శనను కౌన్సిలర్ బాలకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ప్రదర్శన ప్రారంభించారు.