VIDEO: కోడూరు- రెడ్డివారిపల్లెకు రాకపోకలు నిలిపివేత

VIDEO: కోడూరు- రెడ్డివారిపల్లెకు రాకపోకలు నిలిపివేత

అన్నమయ్య: కోడూరు మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుంజనేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కోడూరు- రెడ్డివారిపల్లిని కలిపే తాత్కాలిక వంతెనపై నీరు చేరి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలోని వాగులు, వంకలు నిండిపోవడంతో అధికారులు వంతెన వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.