ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై స్పందించిన బీసీసీఐ

ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై స్పందించిన బీసీసీఐ

ఆసియా కప్ వివాదంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మరోసారి స్పందించారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని బీసీసీఐ, పీసీబీ చీఫ్ నఖ్వీ ఏకాభిప్రాయానికి వచ్చారని దేవజిత్ తెలిపారు. ఐసీసీ సమావేశం సందర్భంగా.. నఖ్వీతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని, వివాద పరిష్కారానికి ఇరు పక్షాలు సానుకూలంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.