11 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

11 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

సూర్యాపేటలో రాజీవ్ నగర్‌లో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 11 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశారన్న సమాచారం మేరకు దాడి చేయగా పీడీఎస్‌ బియ్యాన్ని ఓ ఇంట్లో నిల్వ ఉంచడాన్ని గుర్తించి సీజ్‌ చేశామని పోలీసులు తెలిపారు. ఈ బియ్యాన్నీ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.