మైలురాళ్ల రంగుల అర్థం ఏమిటి?
భారతదేశంలో రోడ్డు పక్కన ఉండే మైలురాళ్లు మనం ప్రయాణించే దూరాన్ని సూచిస్తాయి. వీటిలో ఉండే రంగులకు కూడా ఒక అర్ధం ఉంది. తెల్లటి మైలురాయి పైభాగం పసుపు రంగు ఉంటే జాతీయ రహదారి, అదే తెలుపు ఆకుపచ్చ ఉంటే రాష్ట్ర రహదారి. నలుపు లేదా నీలం రంగు కనిపిస్తే అది జిల్లా రోడ్డు అని, నారింజ రంగు ఉంటే అది గ్రామీణ రహదారి అని సులభంగా గుర్తించవచ్చు.