మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
PLD: సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయంలో శనివారం జరిగిన 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని, నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన పట్టణం సాధ్యమని పేర్కొన్నారు.