'ఈ బౌలింగ్‌తో 500 రన్స్ కూడా సరిపోవు'
సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమిపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ బౌలింగ్‌తో 500 పరుగులు చేసినా గెలవడం కష్టమే అంటూ వ్యాఖ్యానించాడు. ప్రసిద్ధ్, హర్షిత్ నిలకడగా బౌలింగ్ చేయలేకపోతున్నారని తెలిపాడు. అలాగే, వరుణ్ చక్రవర్తిని వన్డేల్లో ఎందుకు ఆడించడం లేదని ప్రశ్నించాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అయినా చక్రవర్తిని ఆడించాలని సూచించాడు.