రామాలయంలో దీపోత్సవ మహోత్సవ కార్యక్రమం
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో కార్తీక దీపోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నామని ఆలయ ప్రధాన పూజారి భానుమూర్తి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసమని అన్నారు. భక్తులు దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని శివుని ఆశీస్సులు పొందగలరని భక్తులకు సూచించారు.