దాతృత్వం చాటుకున్న జిల్లా పెయింటర్స్ అసోసియేషన్

దాతృత్వం చాటుకున్న జిల్లా పెయింటర్స్ అసోసియేషన్

MBNR: జిల్లా పెయింటర్ అసోసియేషన్ మానవత్వాన్ని చాటుకుంది. కొత్తపేట గ్రామానికి చెందిన పెయింటర్ శివకుమార్ గ్యాస్ ట్రబుల్, లివర్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండటంతో అసోసియేషన్ సభ్యులు స్పందించారు. అతనికి చికిత్స నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయం అందజేసి ఆపన్న హస్తం అందించారు. ఈ కార్యక్రమంలో నజీర్, సూరి, జాఫర్, విశ్వనాథ్, జహంగీర్, సాంబా తదితరులు పాల్గొన్నారు.