రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు
AP: అల్లూరి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.