శీతల పానీయాలు ఆరోగ్యానికి హానికరం
NTR: శీతల పానీయాలు ఆరోగ్యానికి హానికరమని, వాటికి బదులుగా మజ్జిగ, నిమ్మరసం వంటి సహజ పానీయాలు సేవించాలని ఎంపీడీవోసీ హెచ్. రవి బాబు పిలుపు నిచ్చారు. శీతల పానీయాలు-నష్టాలు అనే అంశంపై జేవీవీ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో మంగళవారం ఆయన ఆవిష్కరించారు.