మహాసభల కరపత్రాల ఆవిష్కరణ.!
KDP: AP దళిత హక్కుల పోరాట సమితి 3వ మహాసభలు మే 3న జరగనున్నాయని, వాటిని విజయవంతం చేయాలని CPI జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. ఇవాళ మహాసభలకు సంబంధించి కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో మహాసభలు జరగనున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా దళితుల అభివృద్ధి ఏమాత్రం జరగలేదన్నారు.