టాలీవుడ్‌లోకి కుంభమేళా మోనాలిసా
మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ మోనాలిసా అనే యువతి ఫేమస్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె తెలుగులో కథానాయికగా ఓ సినిమా చేయనుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీను కోటపాటి తెరకెక్కించనుండగా.. వర్ధమాన నటుడు సాయి చరణ్ హీరోగా నటించనున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు SMలో వైరల్ అవుతున్నాయి.