నేడు అన్నపూర్ణాదేవికి బియ్యంతో అభిషేకం
VSP: వేపగుంటలో వెలసిన ముత్యమాంబ అమ్మవారి ఆలయంలో ఉగాది సందర్భంగా గురువారం ఉదయం 7 గంటల నుంచి అన్నపూర్ణాదేవికి బియ్యంతో అభిషేకం జరుగుతుందని ఆలయ అర్చకుడు శేషాద్రిశర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు సమర్పించిన బియ్యంతో పాటు, కమిటీ ఆధ్వర్యంలో సుమారు 300 కేజీల బియ్యంతో అభిషేకం చేస్తామని, ఆ తర్వాత భక్తులకు ఆ బియ్యాన్ని ప్రసాదంగా అందజేస్తామన్నారు.