అమరావతిపై దుష్ప్రచారం.. నిమ్మల ఫైర్

AP: వైసీపీ నేతల దుష్ప్రచారంపై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అమరావతిని లేపడానికి పొన్నూరును ముంచారంటూ అంబటి మురళి చేసిన ఆరోపణలు నీటి మూటలు, నీటి మాటలని తేలిపోయాయని అన్నారు. వైసీపీ మీడియా, సోషల్ మీడియా.. ప్రజల్లో భయాందోళనలు, అనుమానాలు రేకెత్తించడం, అశాంతిని సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని మంత్రి దుయ్యబట్టారు.