'ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ప్రభుత్వా లక్ష్యం'
MBNR: జడ్చర్ల మండలం ఎక్వాయపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కలగాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని సృష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగుతుందన్నారు.