VIDEO: ఈ ప్రాంతంలో రాఖీలకు ఫుల్ డిమాండ్

మేడ్చల్: ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి ప్రాంతాల్లో రాఖీలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సిటీలోనే రాఖీలు కొనుగోలు చేసి సోదరీమణులు, సోదరుల వద్దకు పయనమై వెళ్తున్నారు. రూ.20 నుంచి మొదలుకొని రూ.700 వరకు రాఖీలు ఉన్నట్లుగా వ్యాపారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 40 శాతం అధికంగా రాఖీల ధరలు ఉన్నట్లు కొనుగోలుదారులు వాపోయారు.