గుంటూరు బయలుదేరిన H.జంక్షన్ PACS ఉద్యోగులు

గుంటూరు బయలుదేరిన H.జంక్షన్ PACS ఉద్యోగులు

క‌ృష్ణా: గుంటూరులో జరిగే ‘వంట వార్పు’ నిరసన కార్యక్రమానికి హనుమాన్ జంక్షన్ బ్రాంచి నుంచి PACS ఉద్యోగులు మంగళవారం బయలుదేరారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు వారు తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పీఏసీఎస్ ఉద్యోగులు స్పష్టం చేశారు.