విజయవాడలో రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్
NTR: రౌడీ షీటర్లు నేర ప్రవృత్తిని మానుకొని సన్మార్గంలో జీవించాలని పడమట సీఐ పవన్ కిషోర్ సూచించారు. ఆదివారం పడమట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్‌లో రౌడీషీటర్లకు ఆయన దిశా నిర్దేశం చేశారు. కుటుంబంలో ఒక వ్యక్తిపై రౌడీషీట్ నమోదైతే సమాజంలో ఆ కుటుంబం వివక్షకు గురవుతుందని సీఐ తెలిపారు. సత్ప్రవర్తన కలిగి ఉంటే రౌడీషీట్లు తొలగిస్తామన్నారు.