VIDEO: ఆంజనేయస్వామి ఆలయ దర్వాజా ప్రతిష్ఠ

GNTR: తుళ్లూరు మండలం దొండపాడులో ఆంజనేయస్వామి ఆలయ దర్వాజా ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ఆలయ ధర్మకర్తలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆంజనేయస్వామి ఆలయం విశిష్టత గురించి భక్తులకు వివరించారు. గ్రామస్తులు, దాతల సహకారంతో ఆలయాన్ని సుందరంగా నిర్మిస్తున్నట్టు గ్రామ పెద్దలు తెలిపారు.