సజ్జల నూర్పిడి యంత్రంలో పడి వ్యక్తి దుర్మరణం

సజ్జల నూర్పిడి యంత్రంలో పడి వ్యక్తి దుర్మరణం

KRNL: పెద్దకడబూరు మండలం నౌలేకల్ గ్రామ శివారులో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో సజ్జలు నూర్పిడి పట్టే యంత్రంలో ప్రమాదవశాత్తు దొడ్డనగేరి గ్రామానికి చెందిన వ్యక్తి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. యంత్రంలో చిక్కుకోవడంతో మృతుడి శరీరం గుర్తుపట్టలేనంతగా చిద్రమైనట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.