రేపు జిల్లాలో తేలికపాటి వర్ష సూచన
VKB: రేపు పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని వాతావరణ కేంద్రం పేర్కొంది.