ఆర్మూర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థల వివాదం

ఆర్మూర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థల వివాదం

NZB : ఆర్మూర్‌కు మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థలంపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇంఛార్జ్ వినయ్ రెడ్డి మధ్య వివాదం రాజుకుంది. ఎమ్మెల్యే అంకాపూర్‌లో పాఠశాల నిర్మించాలని ఒత్తిడి చేస్తుండగా, వినయ్ రెడ్డి పట్టణానికి సమీపంలోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కనఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మించాలని పట్టుబడుతున్నారు.