యువతి అదృశ్యం.. కేసు నమోదు

యువతి అదృశ్యం.. కేసు నమోదు

MDK: యువతి అదృశ్యంపై శనివారం రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రామాయంపేట పట్టణంలో మంతం ఎల్లవ్వ - చంద్రయ్య దంపతుల కుమార్తె రాజేశ్వరి శనివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. వారు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు పెద్దమ్మ గుడి పూజారి శ్రీనివాస్ పై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు.