టీచర్ కావాలనుకునే వారికి సువర్ణావకాశం
MBNR: జిల్లా డైట్ ప్రిన్సిపల్ డాక్టర్ మహమ్మద్ మేరా జుల్లా ఖాన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2026 విద్యా సంవత్సరానికి ఉమ్మడి జిల్లాలోని డైట్ కళాశాలల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) ప్రవేశాల కోసం అధికారిక నోటిఫికేషన్ వెలువడినట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమన్నారు.