డెంగ్యూ వ్యాధి నివారణపై అవగాహన కల్పించాలి

ASR: గత కొన్నేళ్లుగా దేశంలో డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నాయని జిల్లా ఏఎంవో సత్యనారాయణ, అరకు ఎంపీడీవో లవరాజు అన్నారు. డెంగ్యూ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఈనెల 16న ప్రతీ పంచాయతీలో డెంగ్యూ వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.