ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్
JGL: గర్భిణులు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. 'ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బుధవారం గర్భిణులకు ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించారు. వైద్యుల సూచనలను పాటిస్తూ సాధారణ ప్రసవానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో సుజాత పాల్గొన్నారు.