VIDEO: జిల్లాలో రెండవ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
ADB: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఇవాళ ఆర్టీసీ సమ్మె రెండవ రోజు చేరుకోగా ఆదిలాబాద్ డిపో ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. వీరికి వామపక్ష కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఆర్టీసీ లాభాలలో ఉన్నదని అంటున్న ప్రభుత్వం తమ డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు.