శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనం బోల్తా.. వ్యక్తి మృతి

శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనం బోల్తా.. వ్యక్తి మృతి

ప్రకాశం: దోర్నాల - శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిన్నారుట్ల సమీపంలో మంగళవారం ఓ బైక్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న కొంగా సుబ్బారెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై మహేష్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.