VIDEO: జిల్లాలో దంచి కొడుతున్న వర్షాలు

ప్రకాశం: గిద్దలూరు పరిసర ప్రాంతాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన వర్షం నిర్విరామంగా కురుస్తుంది. ఈదురు గాలులు లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది.