'మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి'

MDK: మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని వెల్దుర్తి ఎస్సై రాజు సూచించారు. బుధవారం నిషా ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మత్తు పదార్థాలు వల్ల జరిగే అనర్ధాలను అవగాహన కల్పించారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాలు సేవించిన, విక్రయించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.