VIDEO: గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన MLA

VIDEO: గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన MLA

MHBD: ఎమ్మెల్యే డా. భూక్య మురళినాయక్ మానవత్వం చాటుకున్నారు. గూడూరు మండలం భూపతిపేట బస్టాండ్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరగగా హుస్సేన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అటుగా వెళుతున్న MLA గాయపడిన వ్యక్తిని చూసి వాహనం ఆపారు. వృత్తిరీత్యా వైద్యుడు కావడంతో అతన్ని పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి, తన ఎస్కార్ట్ పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు.