మక్కకు దిక్కేది..?
WGL: మొక్కజొన్న కొనుగోలు కోసం అధికారులు ఇప్పటి వరకు మార్క్ ఫెడ్ కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంలేదని, మద్దతు ధర పెట్టడంలేదని రైతులు వాపోతున్నారు. ఆరుతడి పంటలు సాగుచేస్తే లాభం వస్తుందని మొక్కజొన్న సాగుచేసిన రైతుకు కన్నీరే మిగులుస్తుంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 3లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు చేశారు. క్వింటాలు 1800ల వరకు కొనుగోలు చేయడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు.