బండరాయిపైకి దూసుకెళ్లిన కారు

బండరాయిపైకి దూసుకెళ్లిన కారు

CTR: గంగాధర్ నెల్లూరు మండలం ఎర్రమరాజుపల్లి వద్ద శుక్రవారం ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బండరాయిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.