వరల్డ్  కప్.. జడ్డూకి SA సిరీస్ కీలకం

వరల్డ్  కప్.. జడ్డూకి SA సిరీస్ కీలకం

క్రికెట్ ఫ్యాన్స్ రోహిత్, కోహ్లీతోపాటు వన్డే వరల్డ్ కప్ 2027లో చూడాలనుకుంటున్న మరో కీలక ఆటగాడు రవీంద్ర జడేజా. అయితే ప్రస్తుతం జట్టులో జడ్డూ స్థానం ప్రశ్నార్థకంగానే ఉంది. ఫిట్‌గా ఉన్నప్పటికీ బౌలింగ్ పదును తప్పినట్లుగా కనిపిస్తుండటమే ఇందుక్కారణం. ఈ తరుణంలో సఫారీలతో రేపటి నుంచి జరిగే సిరీస్‌లో జడ్డూ విజృంభించకపోతే అతని భవితవ్యం మసకబారుతుందనడంలో అనుమానం లేదు.