భారీగా పెరిగిన చికెన్ ధర.. ఎంతంటే?
E.G: రాజమండ్రిలో ఆదివారం మాంసం ధరలు భారీగా పెరిగాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ. 320 కాగా, స్కిన్‌తో కూడిన మాంసం రూ. 300కు విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ. 180 నుంచి రూ. 200 మధ్య లభిస్తోంది. మరో వైపు మటన్ కిలో రూ. 1000కు చేరుకుంది. నెల రోజులుగా ధరలు తగ్గకపోవడంతో మాంసం ప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.