జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిగా బాధ్యతల స్వీకరణ

జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిగా బాధ్యతల స్వీకరణ

SKLM: జిల్లా నూతన వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. అనిత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గత డీఎంహెచ్ డాక్టర్ బాలమురళీకృష్ణ ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో ఆయన స్థానంలో డాక్టర్ అనితను డీఎంహెచ్ఐగా నియమిస్తూ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఆమెకు ఉత్తర్వులు అందినట్లు పేర్కొన్నారు.