జూనియర్లను కొట్టేది.. కెప్టెన్‌పై తోటి ప్లేయర్ ఆరోపణలు
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానాపై ఆ టీమ్ సీనియర్ ప్లేయర్ జహనారా ఆలమ్ తీవ్ర ఆరోపణలు చేసింది. సారథిగా సుల్తానా జట్టులో టాక్సిక్ వాతావరణానికి కారణమవడంతోపాటు జూనియర్లను కొట్టేదని విమర్శించింది. తనతో సహా చాలామంది సుల్తానా బాధితులున్నారని పేర్కొంది. అయితే ఆలమ్ ఆరోపణలను BCB ఖండించింది. అవన్నీ దురుద్దేశంతో చేసినవే తప్ప వాస్తవం కాదని తెలిపింది.