VIDEO: షాద్ నగర్‌లో విద్యార్థి సేన ఆధ్వర్యంలో ర్యాలీ

RR: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజురియంబర్స్‌మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సేన ఆధ్వర్యంలో శనివారం షాద్ నగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు డీకే శివప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థుల పోరాటాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు.