ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
కోనసీమ: అమలాపురం పట్టణంలో ఉన్న ఏరియా ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఓపీ గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఓపీలో ఎక్కువ సేపు పేషెంట్లు వేచి ఉండకుండా తొందరగా చూసి పంపించాలన్నారు. అలాగే, సిబ్బంది సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు.