ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

BHPL: జిల్లా కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై, రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. MLA మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ సాంకేతిక, విద్యా, పంచాయతీ రాజ్ రంగాల్లో చేసిన సేవలను ఆయన కొనియాడారు.