గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే మృతి

గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే మృతి

ప్రకాశం: గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే పిడతల రామ్ భూపాల్ రెడ్డి (89) స్వర్గస్తులయ్యారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రామ భూపాల్ రెడ్డి ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామ భూపాల్ రెడ్డి టిడిపి నుంచి పోటీ చేసి 1994 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రామ భూపాల్ రెడ్డి మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు