నేటి నుంచి రెండో విడత నామినేషన్లు.. ఏర్పాట్లు పూర్తి
BHNG: నేటి నుంచి రెండో విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని అన్నారు. కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా అనుమతించవద్దని ఆయన ఆదేశించారు.