కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మత్స్యకార సెల్ ఛైర్మన్ రాజీనామా
VSP: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మత్స్యకార సెల్ ఛైర్మన్ కదిరి జగన్నాథం సోమవారం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1992 నుంచి కాంగ్రెస్‌లో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. అయితే పీసీసీ అధ్యక్షురాలిగా వై.ఎస్. షర్మిల బాధ్యతలు చేపట్టిన తరువాత సీనియర్లకు ప్రాధాన్యత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.