అక్రమంగా మొరం రవాణా చేస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

అక్రమంగా మొరం రవాణా చేస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

ADB: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను శనివారం పట్టుకున్నట్లు బోథ్ ఎస్సై శ్రీ సాయి తెలిపారు. సోనాల సమీపంలో అక్రమంగా మొరం తరలిస్తుండగా ట్రాక్టర్లు పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. అక్రమ రవాణా చేసిన వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.