బైక్‌ను ఢీ కొన్న కారు.. వ్యక్తికి తీవ్రగాయాలు

బైక్‌ను ఢీ కొన్న కారు.. వ్యక్తికి తీవ్రగాయాలు

MNCL: వేమనపల్లి మండలానికి చెందిన కుమార్ అనే వ్యక్తికి నీల్వాయి-కొత్తగూడెం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నూర్ కి బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.