VIDEO: గచ్చిబౌలిలో బెంజ్ కారు బీభత్సం
HYD: గచ్చిబౌలిలో నానక్‌రామ్‌గూడ వద్ద అతివేగంగా దూసుకొచ్చిన బెంజ్ కారు (TS07EX5556) మరో కారును ఢీ కొట్టింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ఆపే క్రమంలో కానిస్టేబుల్‌ను దాదాపు కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లాడు. వాహనదారుల సహాయంతో కారును నిలిపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.