కనిగిరిలో జాబ్ మేళా నిర్వహణ
ప్రకాశం: కనిగిరిలో జననీ చారిటబుల్ ట్రస్ట్, మేన్ పవర్ మేనేజ్‌మెంట్ సహకారంతో స్థానిక టీడీపీ కార్యాలయంలో ఇవాళ జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో కనిగిరి ప్రాంతంలోనే మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.