గూడూరులో గంజాయి పట్టివేత

MHBD: గూడూరు మండల కేంద్రం శివారులో గంజాయిని సేవిస్తున్న నలుగురు యువకులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన యువకులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 305 గ్రాముల గంజాయి లభించింది. యువకులను అరెస్ట్ చేసి గంజాయితోపాటు నాలుగు సెల్ ఫోన్‌లను స్వాదీన పరచుకొని పోలీసులు కేసు నమోదు చేశారు.